Site icon HashtagU Telugu

PM Modi: కేరళలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన మోదీ

Pm Modi

Pm Modi

PM Modi: కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నిన్న సోమవారం కొచ్చిలో ప్రధాని మోదీ కేరళ సాంప్రదాయ వస్త్రధారణలో అందర్నీ ఆకట్టుకున్నారు. రెండు కిలోమీటర్ల మేర రోడ్ షో చేశారు. ప్రధానితో పాటు వందలాది మంది పాల్గొన్నారు.

రెండ్రోజుల కేరళ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించేందుకు కేరళ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ అధికార నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. అలాగే కేరళ కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. తిరువనంతపురం రైల్వే స్టేషన్‌లో కేరళ తొలి వందేభారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ మధ్య నడుస్తుంది. ఇది కాకుండా దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రోను కూడా ప్రధాని ప్రారంభించారు. 3,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎంపీ శశిథరూర్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… కేరళకు తొలి వందేభారత్ రైలు ప్రారంభమైందని, అలాగే కొచ్చికి వాటర్ మెట్రో లభించిందని మోదీ చెప్పారు. వివిధ కనెక్టివిటీ మరియు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడారు. అనంతరం వందే భారత్ రైలు లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతోనూ ముచ్చటించారు. పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు.

Read More: Aadhaar Photo Update : ఆధార్ కార్డ్‌లో ఉన్న ఫొటో నచ్చలేదా? అయితే వెంటనే ఇలా మార్చకోండి.