PM Modi Degree: మోడీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ మార్చి 31న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ

PM Modi Degree: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ మార్చి 31న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది.

జస్టిస్ బీరెన్ వైష్ణవ్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 30న తన తీర్పును రిజర్వ్ చేసిన ఒక నెల తర్వాత ఈ ఉత్తర్వును జారీ చేసింది. దీంతో మోదీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్‌కు అందించాలని వర్సిటీకి సీఐసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పక్కనపెట్టింది. కేజ్రీవాల్ తన రివ్యూ పిటిషన్‌లో లేవనెత్తిన కీలకమైన వివాదం ఏమిటంటే మోడీ డిగ్రీకి సంబంధించి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని కేజ్రీవాల్ వాదన.

ఆర్‌టిఐ చట్టం ఉద్దేశ్యాన్ని అపహాస్యం చేసినందుకు ఢిల్లీ సిఎంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిరెన్ వైష్ణవ్ బెంచ్ రూ.25,000 జరిమానా విధించింది.

Also Read: KTR: మళ్ళీ తెలంగాణ దే ఘన విజయం: కేటీఆర్