Site icon HashtagU Telugu

Cyclone Michaung: మిక్‌జామ్ తుపాను బాధితులకు మోడీ సంతాపం

Cyclone Michaung:

Cyclone Michaung:

Cyclone Michaung: మిక్‌జామ్ తుపాను కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూడో రోజు కురిసిన వర్షపు నీరు చెన్నైలోని కొన్ని చోట్ల నేటికీ నిలిచి ఉంది. ముఖ్యంగా అశోక్ నగర్, అరుంబాక్కం, వేలచ్చేరి, పెరుంగుడి, తాంబరం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. చాలా చోట్ల పాల కొరత ఏర్పడింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 450 మంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని 18 బృందాలుగా విభజించి వివిధ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.తుపాను కారణంగా నష్టపోయిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మిజామ్ తుఫాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరిలో కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు విపత్తు ప్రతిస్పందన బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని మోడీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Also Read: First Honda electric motorcycle: త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.?