Site icon HashtagU Telugu

Modi call to Bandi: బండి సంజయ్ కి మోడీ ఫోన్!

Bandi And Modi

Bandi And Modi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలంగాణ లో తాజా రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలను ఆరా తీశారు. తెలంగాణలో చోటుచేసుకుంటన్న పరిస్థితులు, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను మోడీకి తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 15 నిమిషాల పాటు మోడీ బండి సంజయ్ తో మాట్లాడినట్టు సమాచారం. బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి తెలంగాణ ముఖ్య నేతలు ఆయన్ను కలుసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విభజన, ఇతర అంశాలపై బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేయనున్నట్టు తెలుస్తోంది!