Modi In Japan: జపాన్ లో మోదీకి ఘన స్వాగతం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ కు చేరుకున్నారు. ఉదయం టోక్యోలో అడుగుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Modi

Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ కు చేరుకున్నారు. ఉదయం టోక్యోలో అడుగుపెట్టారు. ఆయనకు టోక్యోలోని హానెడా అంతర్జాతీయ విమానాశ్రయంలో జపాన్ అధికారులు స్వాగతం పలికారు. తర్వాత ఆయన బస చేసే హోటల్ వద్ద జపాన్ లో భారతీయ సంతతి కి చెందిన వారు ఘన స్వాగతం పలికారు.  భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన భాషలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించిన చిన్నారులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు క్వాడ్‌ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ, యోమియురి షింబున్ వార్తాపత్రికలో భారత్‌, జపాన్‌ల మధ్య సంబంధాలపై ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ఉన్న రెండు ప్రజాస్వామ్య దేశాలుగా, మేము స్థిరమైన, సురక్షితమైన ప్రాంతానికి ముఖ్యమైన స్తంభాలుగా ఉండవచ్చు. అందుకే మా భాగస్వామ్యం అనేక రంగాల్లో విస్తరిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

  Last Updated: 23 May 2022, 12:28 PM IST