Site icon HashtagU Telugu

Pm Modi AP Tour: గన్నవరంలో మోడీ.. ఘనస్వాగతం పలికిన జగన్

Modi

Modi

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. అజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అనంతరం పెదమీరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధాని హాజరుకానున్నారు. బహిరంగసభలో మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.

ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఆయన పాల్గొననున్నారు. భీమవరం చేరుకున్న చిరంజీవికి అభిమానులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అయితే బహిరంగ సభ ఏర్పాట్లకు వర్షం అడ్డంకిగా మారింది. అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో సభ ప్రాంగణం వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది.