Site icon HashtagU Telugu

PM Kisan Funds : పీఎం కిసాన్ నిధుల విడుద‌ల

PM Kisan Mandhan Yojana

telangana paddy farmers

రైతుల కోసం ప్ర‌తి ఏడాది పీఎం కిసాన్ స‌మ్మాన్ కింద మూడు విడ‌త‌లుగా వేస్తోన్న రూ. 2వేల‌ను విడుద‌ల చేశారు. మొత్తంగా 11వ విడ‌త రూ. 2వేల‌ను కేంద్రం జ‌మ చేసింది. రైతులకు లబ్ది చేకూర్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా నేడు 11వ విడత నిధులను విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులను జమ చేశారు. 10 కోట్లకు పైగా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.21 వేల కోట్లను విడుదల చేశారు. కేంద్రం ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6 వేలు అందిస్తోంది. ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున విడుదల చేస్తోన్న విష‌యం విదిత‌మే .