Hyderabad: హైదరాబాద్‌లో అడ్డగోలుగా ప్లాస్మా దందా, ప్రాణాలతో చెలగాటం

  • Written By:
  • Updated On - February 7, 2024 / 01:05 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో అడ్డగోలుగా జరుగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు. గత కొన్నేళ్ల నుండి గుట్టుచప్పుడు కాకుండా మూసాపేట్ లో హీమో సర్విస్‌ ల్యాబోరేటరీస్‌లో డీసీఏ తనిఖీలు నిర్వహించి భారీగా హిమాన్ ప్లాస్మా బ్యాగుల గుర్తించి, సీరం సైతం నిల్వలను సీజ్ చేశారు. ఒక యూనిట్‌ రూ.700కు కొని, రూ.3,800కు ముఠా అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ ఇంటిపై డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు.

తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి.అయితే డీసీఏ అధికారులు తనిఖీల చేసిన క్రమంలో విస్తుపోయే నిజాలను చూశారు. మూసాపేట్‌ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్‌ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హేమో సర్విస్‌ ల్యాబోరేటరీస్‌ లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్‌ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్‌లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్‌.రాఘవేంద్ర నాయక్‌ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. రాఘవేంద్ర నాయక్‌ అనే వ్యక్తి స్వతహాగా ఫార్మసీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తి కావడంతో రక్తానికి సంబంధించిన అవగాహన ఉంది.

అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్‌ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంక్, దారు ఉల్‌ షిఫాలోని అబిద్‌ అలీఖాన్‌ లయన్స్‌ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్‌ బ్లడ్‌ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్‌ అంగీకరించారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులు.