Site icon HashtagU Telugu

Flight: గాల్లో ఉండగానే విమానం ఇంజన్ ఫెయిల్.. క్షణాల్లోనే మంటలు.. చివరికి?

Flight

Flight

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఫ్లైట్ లో అనేక రకాల సమస్యల కారణంగా ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా అలాగే ప్రకృతి వైపరీత్యా కారణంగా ఫ్లైట్లను అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన సంఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఇలాంటి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడం సంతోషించాల్సిన విషయం.

ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ అధికారులు వాటి విషయంలో సీరియస్ గా స్పందించకపోవడంతో అలాంటి సమస్యలు పదేపదే తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక విమానం ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్‌ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టెక్సాస్‌లోని విలియం పి హాబీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. అది మెక్సికో లోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. కానీ టేకాఫ్‌ అయిన వెంటనే ఒక ఇంజిన్‌ నిప్పులు చిమ్మింది. దాంతో వెనకవైపు మంటలు చెలరేగాయి.

. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 30 నిమిషాల వ్యవధిలో టేకాఫ్ అయిన చోటే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మాకు ఏదో పేలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఇంధనం వాసన వచ్చింది అని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు. మెకానికల్‌ సమస్య రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమానయాన సిబ్బంది తెలిసింది. ప్రయాణికులందరినీ వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపించామని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version