తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు శ్రీ కె.సి.ఆర్ గారు. ఎంతటి జఠిలమైన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం శ్రీ కె.సి.ఆర్.గారిని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది.
సమకాలీన రాజకీయనాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం శ్రీ కె.సి.ఆర్.గారిలోని మరో ప్రత్యేకత. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్ధులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం. రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు నాకూ ఆనందాన్ని కలిగించింది. నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో శ్రీ కె.సి.ఆర్. గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.