CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కీలక పారిశ్రామిక ప్రాంతమైన కృష్ణపట్నం వెళ్లేందుకు సిద్ధమైన క్రమంలో… ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల కృష్ణపట్నం పర్యటనను ఆయన తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ముందుగా తిరుపతిలో ఉన్న కేంద్రమంత్రి, అక్కడి నుంచి కృష్ణపట్నం బయలుదేరేందుకు హెలికాప్టర్ ఎక్కారు. అయితే టేకాఫ్‌కు ముందు తలెత్తిన సాంకేతిక లోపాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్‌ను భద్రతా పరంగా పరీక్షించిన తర్వాతే సమస్య తలెత్తిన విషయం నిర్ధారించడంతో పీయూష్ గోయల్ వెంటనే పర్యటనను క్యాన్సిల్ చేశారు.
Mahesh Goud : మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ హెలికాప్టర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ జిల్లా పర్యటనల కోసం వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం రావడం అధికార వర్గాల్లో తీవ్ర కలవరాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటువంటి సమస్యలు వీఐపీలకు వినియోగించే విమానాల్లో తరచూ తలెత్తుతున్నాయంటే, అది ప్రోటోకాల్ భద్రతకు తీవ్రమైన ప్రమాదం కావొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్ర మంత్రికి హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన తిరిగి తిరుపతిలోని విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర భద్రతా విభాగం అప్రమత్తమైంది. హెలికాప్టర్ వినియోగంపై సమగ్ర నివేదిక అందించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ ఘటనతో అధికార యంత్రాంగం జాగ్రత్తలు మించి భద్రతా ప్రమాణాలను పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల ప్రయాణాల్లో ఉపయోగించే విమాన, హెలికాప్టర్ లాంటి వాహనాల పునిరీక్షణ అనివార్యమైందని సూచిస్తున్నారు.