Site icon HashtagU Telugu

Viral Video: తల్లి కోరిక తీర్చిన ఎయిర్‌ లో కో-పైలట్

Viral Video

New Web Story Copy 2023 06 27t201748.247

Viral Video: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విజయాన్ని కోరుకుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు వారి జీవితాన్ని ఎంతగా కోల్పోయారో కూడా పట్టించుకోరు. పిల్లల లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి మరియు త్యాగాలు చేయడానికి తల్లిదండ్రులు ఏ మాత్రం వెనుకాడరు. ఓ తల్లి తన పైలట్ కొడుకుతో కలిసి ప్రయాణించాలనుకుంది. తల్లి కోరిక మేరకు కొడుకు తన తల్లి కలను నెరవేర్చాడు.

ఈజిప్ట్ ఎయిర్‌లో కో-పైలట్ అయిన ముప్పై ఒక్క ఏళ్ల అబ్దుల్లా మహ్మద్ బహి ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశాడు. “ఆమె తన జీవితమంతా మా కోసం వెచ్చించింది… ఆమె ఏకైక కల నాతో ప్రయాణించడం.” అని పోస్ట్ కి కాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని 3 మిలియన్లకు పైగా చూశారు, 80,000 లైక్‌లు, కామెంట్‌లతో ఈ వీడియో వైరల్ అయింది. పైలట్ తన తల్లి కలను సాకారం చేసినందుకు అతనిని అభినందిస్తున్నారు నెటిజన్స్. ఇక ఇంత అద్భుత సందర్భాన్ని ఇచ్చినందుకు తన సహోద్యోగులకు పైలట్ కృతజ్ఞతలు తెలిపాడు.

Read More: ORR Speed Limit: దూసుకెళ్లొచ్చు..! హైద‌రాబాద్‌ ఓఆర్ఆర్‌పై గ‌రిష్ట వేగం ప‌రిమితి పెంపు