Site icon HashtagU Telugu

Pilot Emotional: జెట్ ఎయిర్ విమానం పైలెట్ ఉద్వేగం

Jetairways

Jetairways

మూడేళ్ల త‌రువాత జెట్ ఎయిర్ వేస్ విమాన ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. ఆ సంద‌ర్భంగా విమానం పైలెట్‌, ఏటీఎస్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ వైర‌ల్ అయింది. ఆడియోను జెట్ ఎయిర్ వేస్ ట్వీట్ చేసింది. ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తూ మూడేళ్ల విరామం త‌రువాత విధుల్లోకి రావ‌డం సంతోషాన్ని క‌లిగింది. దీంతో పైలెట్ భావోద్వేగం పొందారు. ఆ సంద‌ర్భంగా ఏటీఎస్ తో ఆయ‌న పంచుకున్న సంభాష‌ణ వైర‌ల్ అయింది.

జెట్ ఎయిర్‌వేస్ ట్వీట్ ఇలా ఉంది, “ఈరోజు, మే 5, మా 29వ పుట్టినరోజు, జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ ప్రయాణించింది! ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న, పని చేస్తున్న మరియు ప్రార్థిస్తున్న అంద‌రికీ, అలాగే జెట్ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు వేచి ఉండలేని జెట్ నమ్మకమైన కస్టమర్‌లకు భావోద్వేగమైన రోజు. అంటూ ట్వీట్ చేసింది. 3 సంవత్సరాల విరామం తర్వాత హైదరాబాద్‌లో జెట్ ఎయిర్‌వేస్ టెస్ట్ ఫ్లైట్ నిర్వహించినప్పుడు పైలట్ ఉద్వేగానికి గుర‌వ‌డం సోష‌ల్ మీడియాలో ఆయ‌న సంభాష‌ణ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.