Site icon HashtagU Telugu

PIL RRR: ‘ఆర్ఆర్ఆర్’పై హైకోర్టులో పిల్

ramcharan rrr

ramcharan rrr

కరోనా కేసుల నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడుకుంటూ వస్తోంది. అయితే ఆ సినిమాను విడుదల చేయొద్దని అల్లూరి సీతారామరాజు ఫామిలీ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆ సినిమాకి అనుమతి ఇవ్వొద్దని ఒక మహిళ హైకోర్టులో పిల్ వేసింది.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరంలో నివసించే అల్లూరి సీతారామరాజు కుటుంబానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ పిల్ వేసినట్లు సమాచారం.

చరిత్రలో ఎన్నడూ కలవని అల్లూరి, కొమరంభీమ్ కలిసి పోరాటం చేసినట్లు సినిమాలో చూపిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఇది ముమ్మాటికీ అల్లూరి, కొమరం భీమ్ చరిత్రను వక్రీకరించడమే అని సౌమ్య ఆరోపిస్తోంది.

బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరిని బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా చూపించినట్లు కన్పిస్తోందని ఇది అల్లూరి సీతారామరాజును, తెలుగు ప్రజలను అవమానించడమేనని సౌమ్య పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకి సెన్సార్ అనుమతి ఇవ్వకూడదని, ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని సౌమ్య విజ్ఞప్తి చేస్తోంది.

చరిత్రకారుల సినిమాలను కధాంశంగా తీసుకున్నప్పుడు ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. మరి అల్లూరి కుటుంబ సభ్యురాలు చేస్తోన్న అభ్యంతరాలపై సినిమా యూనిట్ ఏవిధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Exit mobile version