Site icon HashtagU Telugu

Cinema: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా‌పై హైకోర్టులో కేసు నమోదు

Template (21) Copy

Template (21) Copy

రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. 1920నాటి స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల పాత్రలతో ఫిక్షనల్ గా ఈ సినిమాను రూపొందించగా.. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిల్ వేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని పిటీషనర్ కోరారు. అలాగే సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం పిల్ ని విచారించనున్నారు.

Exit mobile version