Site icon HashtagU Telugu

Mahindra Armado: ఆర్మీ కోసం ప్రత్యేక వాహనాన్ని రూపొందించిన మహీంద్రా.. వీడియో వైరల్?

Mahindra Armado

Mahindra Armado

దేశీయ దిగ్గజ కార్ మేకర్ మహీంద్రా గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా మహీంద్రా ఇండియా సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించింది. ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ ఆర్మడో డెలివరీని ప్రారంభించనున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ పేరుతో పూర్తి దేశీయ టెక్నాలజీతో మహీంద్రా గ్రూప్ ఈ వాహనాలను తయారుచేస్తోంది. ఇదే విషయంపై మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ..

మహీంద్రా డిఫెన్స్ మేము ఇప్పుడే ఆర్మడో భారతదేశపు మొదటి ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ డెలివరీ ని ప్రారంభించాము. మన సాయుధ దళాల కోసం భారతదేశంలో గర్వంగా అభివృద్ధి చేసి రూపొందించబడింది. జైహింద్ అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. అలాగే ఆ ప్రాజెక్టులు పాలుపంచుకున్న వారికి ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. సహనం పట్టుదల అభిరుచితో ప్రాజెక్టును నిజం చేసిన సుఖ్ వింధర్ హేయర్ అతని టీం కి నా కృతజ్ఞతలు అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆర్మడో అనేది భారత రక్షణ దళాల ఉపయోగం కోసం నిర్మించిన తేలికపాటి సాయుధ వాహనం. ఇది అదనపు లోడ్ బేరింగ్ కెపాసిటీతో వస్తుంది.

 

ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఉద్రిక్త ప్రాంతాలలో పెట్రోలింగులలో ఉపయోగపడనుంది. ప్రత్యేక దళాలు క్విక్ యాక్షన్ టీమ్స్ కీ ఈ వాహనం చాలా అనుకూలంగా ఉండడం ఉంది. దీనిని సరిహద్దుల వెంబడి ఎడారి ప్రాంతాల్లో సరిహద్దు భద్రత కోసం కూడా ఉపయోగించవచ్చట. ప్రస్తుతం ఆ వాహనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .