Liger’s Big Surprise: న్యూడ్ లుక్ లో విజయ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ మూవీ షూటింగ్ కంప్లీట్ కావోస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Vijay

Vijay

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ మూవీ షూటింగ్ కంప్లీట్ కావోస్తోంది. ఈ మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ తో అందర్నీ మెస్మరైజ్ కు గురిచేసింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో  విజయ్ దేవరకొండ తన బట్టలన్నీ విప్పి నగ్నంగా నిలబడి ఉన్నాడు. ఓ స్టార్ డమ్ ఉన్న నటుడు ఇలా చేయడం ఆశ్చర్యపర్చింది. పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమని విజయ్ నిరూపించాడు.

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించడానికి సిక్స్ ప్యాక్ కఠినంగా శ్రమించాడు. ప్రొఫెషనల్‌గా కనిపించేందుకు శిక్షణ కూడా తీసుకున్నాడు. రియల్ ఫైటర్ గా విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం అవుతున్నాడు. భారీ అంచనాలతో ఈ క్రేజీ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

  Last Updated: 02 Jul 2022, 11:54 AM IST