టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ RRR టీమ్ మొత్తం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్, లీడ్ యాక్టర్స్ హైప్ ని కొనసాగించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ వారు రానా దగ్గుబాటిని అతని ముంబై ఫ్లాట్‌లో కలుసుకున్నారు. అతనితో సరదాగా గడిపారు. రానా తన సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
All R smiles 🙂 #RRR @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan pic.twitter.com/ct4AFmv63R
— Rana Daggubati (@RanaDaggubati) December 22, 2021
