Site icon HashtagU Telugu

Google Pay Users: ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు షాక్.. 2 వేలు దాటితే!

994953 947635 Upi Transactions India

994953 947635 Upi Transactions India

ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. కూలీ నుంచి కలెక్టర్ దాకా చాలామంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. దీన్నే అవకాశంగా భావించినా కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపులు చేసేవారిపై అదనపు భారం పడనుంది. రూ.2000లకుపైగా వ్యాల్యూతో యూపీఐ చెల్లింపులు చేస్తే 1.1 శాతం ఇంటర్‌‌చేంజ్ ఛార్జీ వర్తిస్తుంది. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ కూడా పీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్ల కిందకే వస్తాయి. రిటైల్ కస్టమర్లపై తాజా చార్జీల భారం పడదు. కస్టమర్ల నుంచి రూ.2,000కు పైగా పేమెంట్ ను వర్తకులు స్వీకరించినప్పుడు ఈ చార్జీ వారికి పడుతుంది. పేమెంట్ స్వీకరించిన వర్తకుడి బ్యాంక్ ఈ చార్జీని, చెల్లించిన వ్యక్తి బ్యాంక్ కు చెల్లిస్తుంది.

ఏప్రిల్ 1 నుంచి కొన్ని సేవలపై ఛార్జీలు వర్తించబోతున్నాయి. యూపీఐ ద్వారా జరిపే మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కు ప్రీపేయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) ఛార్జీలు వర్తించబోతున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటివలే ఒక సర్క్యూలర్ విడుదల చేసింది. మర్చంట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు (Marchant transactions charges) ఏప్రిల్ 1, 2023 నుంచి వర్తించబోతున్నాయని వెల్లడించింది. దీనిపై గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యూజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాలు కూడా మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి.