Site icon HashtagU Telugu

Philips Cuts Jobs: మరో షాక్.. ఫిలిప్స్ లో 6 వేల జాబ్స్ కట్!

Philips

Philips

ఆర్థిక సంక్షోభమో (Finance Crisis), ఇతర కారణాలో తెలియదు కానీ.. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు (IT Company), ఈకామర్స్, బిజినెస్ కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో ఎంతో కాలంగా ఉద్యోగ బాధ్యతలు (Jobs) నిర్వహిస్తున్నవాళ్లకు చెక్ పెడుతోంది. వేల సంఖ్యలో తమ తమ ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటికే గుగూల్ (Google), ట్విట్టర్, అమెజాన్ లాంటి సంస్థలు ఉద్యోగాల కోత విధించగా, తాజా నష్టాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా 6,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు డచ్ మెడికల్ టెక్ మేకర్ ఫిలిప్స్ (Philips) సోమవారం తెలిపింది. ఈ మేరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకోబ్స్ 2025 నాటికి అవసరమైన మా శ్రామిక శక్తిని (ఉద్యోగులను) మరింత తగ్గించాలని” ప్రకటించారు.

Also Read: Bollywood Khans: ఈ దేశం ‘ఖాన్స్’ ను మాత్రమే ప్రేమిస్తోంది.. కంగనా ట్వీట్ వైరల్!