Site icon HashtagU Telugu

Breaking: PFI అధికారిక ట్విట్టర్ అకౌంట్ బ్యాన్..!!

Pfi

Pfi

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలపై 5ఏళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో పీఎఫ్‌ఐకి చెందిన 200 మందికి పైగా నేతలను ఈడీ,సీబీఐ అరెస్టు చేసింది. నిషేధించిన పీఎఫ్ఐ ట్విట్టర్ అకౌంట్లో దాదాపు 81,000 మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ట్విట్టర్ ఇండియా పీఎఫ్‌ఐ ప్రెసిడెంట్ ఓఎంఏ సలాం, జనరల్ సెక్రటరీ అనిస్ అహ్మద్‌ల ట్విట్టర్ ఖాతాలను బ్యాన్ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాల సందర్భంగా వారిని అరెస్టు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద PFI దాని 8 అనుబంధ సంస్థల వెబ్‌సైట్‌లు, ఇంటర్నెట్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.