Site icon HashtagU Telugu

Petrol Diesel Prices: నేటి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇలా.. మీ నగరంలో ఒక లీటర్ ధర ఎంతో తెలుసుకోండి..?

Free At Petrol Pump

Free At Petrol Pump

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices)ను ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి. నేటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు మారలేదు.

ప్రధాన మెట్రోలలో పెట్రోల్, డీజిల్ ధరలు

– ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62

– కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76

– చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24

– ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27

Also Read: Gold Price: బంగారం, వెండి కొనాలనుకునేవారికి ఈరోజే మంచి ఛాన్స్.. నేడు భారీగా తగ్గిన ధరలు..!

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

– నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.59, డీజిల్ రూ.89.76

– గురుగ్రామ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.92, డీజిల్ రూ.89.79

– చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26

– హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82

– జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ.109.05, డీజిల్ రూ.94.24

– పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04

– లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76

– బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89

ముడి చమురు ధర ఎంత..?

ముడిచమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $1.85 లేదా 2.49 శాతం పెరిగి బ్యారెల్‌కు $76.13 వద్ద, WTI క్రూడ్ బ్యారెల్‌కు $1.64 లేదా 2.34 శాతం పెరిగి $71.74 వద్ద ఉంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా తనిఖీ చేయాలి..?

మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా మాత్రమే సులభంగా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. డీలర్ కోడ్ RSPని 92249 92249కి SMS చేయాలి.