Petrol and Diesel Prices: రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు..!

  • Written By:
  • Publish Date - March 23, 2022 / 10:47 AM IST

భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజ‌ల్ ధ‌ర‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో దేశంలోని వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, దాదాపు నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఫ‌లితాలు వ‌చ్చేసిన నేప‌ధ్యంలో దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభించాయి.

ఈ క్ర‌మంలో బుధ‌వారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్​పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 97.01, లీట‌ర్డీజిల్ ధ‌ర‌ 88.27 రూపాయ‌ల‌కు చేరింది. ముంబయిలో 111.65, డీజిల్ ​ధ‌ర 95.83 రూపాయ‌ల‌కు చేరింది. కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర 106.33, లీటర్​ డీజిల్ ధర 91.40 రూపాయ‌ల‌కు చేరింది. చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 102.90, లీటర్​ డీజిల్ ధర 92.94 రూపాయ‌ల‌కు చేరింది. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర 109.99, లీటర్ డీజిల్​ ధర 96.35 రూపాయ‌ల‌కు చేరింది. గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధ‌ర 102.0, లీట‌ర్ డీజిల్​ ధ‌ర 98.10 రూపాయ‌ల‌కు చేరింది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర 110.78, లీటర్​ డీజిల్​ ధర 96.84 రూపాయ‌లుకి చేరింది.