Petrol Diesel: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 27, 2023 / 11:17 AM IST

Petrol Diesel: పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత ముడి చమురు ధర పెరుగుతోంది. ఈ ట్రెండ్ శుక్రవారం కూడా కొనసాగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్, WTI క్రూడ్ ఆయిల్ రెండూ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. WTI ముడి చమురు ధరలో 0.58 శాతం పెరుగుదల కనిపించింది. ఇది బ్యారెల్‌కు $ 83.69 స్థాయిలో ఉంది. అదే సమయంలో బ్రెంట్ ముడి చమురు ధరలో 0.66 శాతం పెరుగుదల కనిపించింది. ఇది బ్యారెల్‌కు $ 88.51గా ఉంది.

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.77, డీజిల్ రూ.94.37గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109. 66, లీటర్ డీజిల్ రూ. 97.82 కాగా విజయవాడలో పెట్రోల్ రూ. 111.45, లీటర్ డీజిల్ రూ. 99.22గా ఉంది.

Also Read: Gold- Silver: రూ. 62 వేలకు చేరిన బంగారం ధరలు.. మీ ఏరియాలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. భారత్ లో 2017 జూన్ నుంచి పెట్రోల్ ధరలను ప్రతి రోజు సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 2017 జూన్ కు ముందు రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవారు.

We’re now on WhatsApp. Click to Join.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపాలి. ఇండియన్ ఆయిల్ కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి RSP <డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు పంపండి. HPCL కస్టమర్లకు ఇంధన ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.