న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 4, 2022) లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లో మొత్తం ధరలు లీటరుకు రూ. 8.40కి పెరిగింది. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 12వ సారి. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రేట్లు పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి ధరల వ్యత్యాసం మారుతూ ఉంటాయి.
ఢిల్లీలో పెట్రోలు ధర గతంలో రూ. 103.41 నుండి రూ. 103.81 కాగా, డీజిల్ ధరలు లీటరుకు రూ. 94.67 నుండి రూ. 95.07కి పెరిగాయి. ముంబైలో లీటరు పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.118.83, రూ.103.07గా ఉన్నాయి. పెట్రోలు ధరలు శ్రీనగర్ నుండి కొచ్చి వరకు అన్ని ప్రధాన నగరాల్లో లీటరుకు రూ. 100 కంటే ఎక్కువగా ఉండగా.. తిరువనంతపురం, హైదరాబాద్, భువనేశ్వర్, రాయ్‌పూర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక నగరాల్లో డీజిల్ ధర దాని కంటే ఎక్కువగా ఉంది. డీజిల్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూర్‌లో అత్యంత ఖరీదైనది. రాజస్థాన్‌లోని సరిహద్దు పట్టణం శ్రీ గంగానగర్‌లో పెట్రోల్ అత్యంత ఖరీదైనది.