Site icon HashtagU Telugu

Petrol Price Hike : త‌గ్గేదెలే అంటున్న పెట్రోల్ ధ‌ర‌లు.. 13 రోజుల్లో 11సార్లు…!

పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. గ‌డిచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి. క‌రోనా సంక్షోభం నుంచి భ‌య‌ట‌ప‌డ‌ని సామాన్యులపై తాజాగా ఈ ధ‌ర‌లు పెర‌గ‌డంతో మ‌రింత భారం అవుతుంది. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్ప‌టికే వంట‌నూనెల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌గా.. దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117 రూపాయలు దాటేసి రూ. 117.21కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 103.03కి చేరుకుంది. ఇటు ఏపీలోని గుంటూరులో లీటరు పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. ఫలితంగా పెట్రోలు ధర రూ. 119.07, డీజిల్ ధర రూ. 104.78కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరపై 80 పైసలు చొప్పున పెంచారు. ఈ 11 రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 8 రూపాయలకు పైనే పెరిగింది.

Exit mobile version