Site icon HashtagU Telugu

Petrol-Diesel Price: తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లివే..!

Petrol- Diesel Rates Today

Petrol- Diesel Rates Today

Petrol-Diesel Price: లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. పెట్రోలు, డీజిల్ ధరలను (Petrol-Diesel Price) ప్రభుత్వం రూ.2 తగ్గించింది. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఈ సమాచారాన్ని అందించారు. తగ్గిన చమురు ధరలు శుక్రవారం (మార్చి 15) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వ‌చ్చాయి.

‘పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించడం ద్వారా దేశంలోని విజయవంతమైన ప్రధాని నరేంద్ర మోడీ కోట్లాది భారతీయుల కుటుంబ సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని మరోసారి నిరూపించుకున్నారు’ అని హర్దీప్ పూరి తన పోస్ట్‌లో రాశారు. ప్రపంచం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్రోలు ధరలు 50-72 శాతం పెరిగాయి. మన చుట్టూ ఉన్న అనేక దేశాలలో పెట్రోల్ లభ్యత ఆగిపోయింది. అయినప్పటికీ 1973 నుండి యాభై సంవత్సరాల అతిపెద్ద చమురు సంక్షోభం ఉన్నప్పటికీ PM మోదీ తన దూరదృష్టి, సహజమైన నాయకత్వం కారణంగా భార‌త‌దేశంలోని ప్ర‌జ‌ల‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. ఈ కొత్త ధరలు నేటి ఉదయం 6 నుంచి అమలులోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుందని పెట్రోలియం మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Also Read: Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో

పెట్రోల్-డీజిల్ ఎంత ధరకు అందుబాటులో ఉంది

ఈ త‌గ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం నుండి పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 94.72గా ఉంది. నిన్న‌టివ‌ర‌కు ఇది లీటరుకు రూ. 96.72గా ఉంది. అదే సమయంలో డీజిల్ రూ.87.62కి అందుబాటులో ఉంది. నిన్న‌టివ‌ర‌కు ఇది లీటరుకు రూ.89.62గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.41, డీజిల్ ధర రూ.95.65గా ఉంది.

We’re now on WhatsApp : Click to Join

– ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.72, డీజిల్ రూ.87.62గా ఉంది.
– ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.31, డీజిల్ ధర రూ.92.27గా ఉంది.
– కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.03, డీజిల్ ధర రూ.90.76గా ఉంది.
– చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73, డీజిల్ ధర రూ.92.33గా ఉంది.