Petrol Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 07:55 AM IST

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత ముడి చమురు ధరలో విపరీతమైన పెరుగుదల ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు. ముంబైలో పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109. 66, లీటర్ డీజిల్ రూ. 97.82 కాగా విజయవాడలో పెట్రోల్ రూ.111.38, లీటర్ డీజిల్ రూ. 99.16గా ఉంది.

Also Read: Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!

గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. భారత్ లో 2017 జూన్ నుంచి పెట్రోల్ ధరలను ప్రతి రోజు సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 2017 జూన్ కు ముందు రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవారు.

We’re now on WhatsApp. Click to Join.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపాలి. ఇండియన్ ఆయిల్ కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి RSP <డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు పంపండి. HPCL కస్టమర్లకు ఇంధన ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.