దేశంలో సామాన్యుడి జేబుకు చిల్లి పెట్టేందుకు చమురు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకటి, రెండు రోజుల్లో పెరగనున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చమురు సంస్థలు భారీగా ధరలను పెంచనున్నాయని చెబుతున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం ఆ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. దీంతో దేశంలో మరోసారి రోజు వారీ పెట్రోలు ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక దేశంలో ఒకేసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకుండా రోజువారీ బాదుడు ఉండబోతుందంటున్నారు. పెట్రోలు పై ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర బ్యారెల్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ముడిచమురు ధరలు బాగా పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. దీంతో పెట్రోలుకు లీటరకు 10 నుంచి 15 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు 10 నుంచి 12 రూపాయలు పెరగవచ్చని అంటున్నారు. అయితే ఒక్కసారి మాత్రం కాకుండా ప్రతి రోజూ పెంచుకుంటూ పోతారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఇండియాలో పెట్రోల్ ధర వందరూపాయలుకు పైగానే ఉంది.