Site icon HashtagU Telugu

Petrol Diesel Prices: బాదుడు షురూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు..!

Free At Petrol Pump

Free At Petrol Pump

సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌డంతో, దాదాపు నాలుగు నెల‌లు త‌ర్వాత పెట్రోలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ చమరుసంస్థలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో లీటర్ పెట్రోలుపై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణ‌లోని హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 109.10 రూపాయలు, లీటరు డీజిల్ ధర 95.49 రూపాయలుకు చేరింది.

ఇక మరో తెలుగు రాష్ట్రం ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 110.80 రూపాయ‌లు, డీజిల్ ధ‌ర‌ 96.83 రూపాయ‌ల‌కు చేరింది. అలాగే గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 111.21 రూపాయ‌లు, డీజిల్ ధర 97.26 రూపాయ‌ల‌కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 96.21, డీజిల్ ధ‌ర 87.47 రూపాయ‌లుకు చేరింది. దేశ‌ వాణిజ్య నగరం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 110.82, డీజిల్ ధ‌ర 95.00 రూపాయ‌ల‌కు చేరింది. కోల్‌క‌తాలో పెట్రోల్ 105.51, డీజిల్ 90.62 రూపాయ‌ల‌కు చేరింది. చెన్నైలో పెట్రోల్ 102.16, డీజిల్ ధ‌ర 92.19 రూపాయ‌ల‌కు చేరింది. ఇక పెరిగిన ధ‌ర‌లు మార్చి 22 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.