Pakistan Fuel – Rs 300 : పాకిస్తాన్ చరిత్రలో ఈరోజు అత్యంత దుర్భరమైంది. ఎందుకంటే అక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎన్నడూ లేని విధంగా లీటరుకు రూ.300 మార్కును దాటేశాయి. అక్కడ ఇంధన ధరల ఈ రేంజులో ఎగబాకడం ఇదే తొలిసారి. తాజాగా గురువారం రాత్రి పాక్ లో లీటరు పెట్రోలు ధర రూ.14.91 మేర పెరిగి రూ.305.36కు చేరింది. ఇక హైస్పీడ్ డీజిల్ ధర రూ.18.44 మేర పెరిగి రూ.311.84కి చేరింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకం విలువ రూ.305.6గా ఉంది. పాకిస్థాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో దాన్ని కంట్రోల్ లోకి తెచ్చేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఫలితంగా అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.
Also read : Pakistani Wedding : పెళ్లి విందులో మటన్ ముక్క తెచ్చిన కొట్లాట..
నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు భగ్గుమంటుండటంతో పేద ప్రజలు లబోదిబోమంటూ గుండెలు (Pakistan Fuel – Rs 300) బాదుకుంటున్నారు. కరెంటు బిల్లులను కూడా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో పాక్ లో ప్రజలకు నిరసనకు దిగుతున్నారు. కరెంటు బిల్లుల్ని కాల్చేసి నిరసన తెలుపుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి కదలిక లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), చైనా ఇస్తున్న అప్పులపై ఆధారపడి ప్రస్తుతం పాక్ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది.