Site icon HashtagU Telugu

MP Santosh: నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం: ఎంపీ సంతోష్

Santhosh

Santhosh

తాను జన్మించిన పెట్లబుర్జ్ దవాఖాన అభివృద్ధికి గతంలో తాను హామీ ఇచ్చిన కోటి రూపాయల్లో.. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మొదటి విడతగా 50 లక్షల రూపాయల మంజూరీ పత్రాన్ని ఇవ్వాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా, ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ పి. మాలతికి అందజేశారు. తాను హామీ ఇచ్చిన మిగతా 50 లక్షల రూపాయలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నిధుల నుండి విడుదల చేస్తానని ఆయన తెలిపారు.

పెట్లబుర్జు ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లవేలల అండగా ఉంటానని, తనతో పాటు తన మిత్రులు కూడా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన దవాఖాన అభివృద్ధి పట్ల చూపించిన ఆసక్తి మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.