Site icon HashtagU Telugu

Dog Bite case: కుక్క కరిచి నొప్పితో విలవిల్లాడుతున్న బాలుడు.. కనికరం చూపించని మహిళ?

Viral Video

Viral Video

సాధారణంగా మనం చిన్న పిల్లలకు ఏదైనా అయితే తట్టుకోలేను. చిన్నపిల్లలు మనవాళ్ళు అయినా పరాయి పిల్లలు అయినా ఏదైనా బాధతో బాధపడుతుంటే వెంటనే అడిగి మరి సహాయం చేస్తుంటాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక సంఘటనలో మహిళ మాత్రం పిల్లాడి పట్ల కనికరం కూడా చూపించకపోవడం ప్రస్తుతం నెటిజెన్స్ ని ఆగ్రహానికి గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌ లోని ఓ హౌజింగ్‌ సొసైటీలో నివసిస్తున్న బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి ఎక్కాడు.

ఆ తర్వాత ఓ మహిళ కూడా తన పెంపుడు శునకంతో ఆ లిఫ్ట్‌లో ఎక్కింది. అయితే లిఫ్ట్‌ లోకి ఎక్కిన తర్వాత ఆ బాలు లిఫ్ట్ లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా వెంటనే ఆ మహిళ తో పాటు వచ్చిన ఆ కుక్క ఆ బాలుడిని కరిచింది. దీంతో వెంటనే ఆ బాలుడు కాలును పట్టుకుని ఆ నొప్పితో విలవిలలాడుతున్నాడు. ఆ సమయంలో ఆ మహిళ ఏమి కాదు అని చెప్పాల్సింది పోగా తనకేమీ పట్టనట్టుగా అలాగే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆ కుక్క కాటుకి ఆ పిల్లవాడు మాత్రం నొప్పితో విలవిలలాడుతున్నాడు.

 

ఇక లిఫ్ట్ ఓపెన్ కాగా బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్క మరొకసారి ఆ పిల్లవాడిని కరిచేందుకు ప్రయత్నించింది. కదా ఎందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. బాలుడు నొప్పితో విలవిలాడుతున్న సదరు మహిళ స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మానవత్వం మరిచిపోయి ఆ మహిళ ప్రవర్తించింది అంటూ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఘజియాబాద్‌ పోలీసులు స్పందించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ శునకం యజమాని పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.