Site icon HashtagU Telugu

Peru Earthquake: పెరూలో భారీ భూకంపం…రిక్టార్ స్కేలుపై 7.2గా నమోదు..!!

Earthquake

Peru Earthquake

పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం పెరూ-బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపు 217కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు.

 కాగా ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పెరూ తీరాన్ని ఆనుకుని ఉన్న పసిఫిక్ సముద్రంలో నాజ్కా టెక్టానిక్ ప్లేట్ ప్రతిఏడాది తూర్పు ఈశాన్య దిశగా 71మి.మీ కదులుతోంది. దీంతోప్లేట్లు పరస్పరం ఢీకొనడంతో భూకంపాలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజా భూకంపం భూమి లిథోస్పియర్ పొరలో సంభవించినట్లు నిపుణులు చెబుతున్నారు.