Site icon HashtagU Telugu

Venkaiah Naidu:ఉపరాష్ట్రపతికి తప్పని తిప్పలు..వెంకయ్య పేరుతో నకిలీ మెసేజ్ లు..!!

Venkaiah Naidu

Venkaiah Naidu

సోషల్ మీడియాలో కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. తను కష్టాల్లో ఉన్నానని…ఆర్థిక సాయం కావాలంటూ మెసేజ్ లు పెట్టి…తప్పుడు నెంబర్లతో దోచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఇచ్చి ఎంతో మంది మోసపోయారు. అయితే ప్రముఖులను కూడా వదలడం లేదు ఈ కేటుగాళ్లు. ఏకంగా భారత ఉపరాష్ట్రపతి పేరుతో నకిలీ మెసేజ్ లు పంపిస్తున్నారు.

ఆర్థికం సాయం చేయమంటూ…భారత రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో వాట్సాప్ లలో మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం వెంకయ్యనాయుడు వరకు వెళ్లడంతో…దీనిపై స్పందిచారు ఆయన. తన పేరుతో వస్తున్న మెసేజ్ లకు స్పందించవద్దంటూ సూచించారు. తన పేరుతో సహాయం, ఆర్థిక సహాయం కోరుతూ వాట్సాప్ మెసేజ్ లు వస్తే ప్రజలు పట్టించుకోవద్దని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఉపరాష్ట్రపతి కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఒక అధికారిక ప్రకటనలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో మొబైల్ నెంబర్ 9439073183 నుంచి సాయం చేయాలంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపిస్తున్నారని..వాటికి స్పందించవద్దని సూచించారు. మరిన్ని నెంబర్ల నుంచి నకిలీ మెసేజ్ లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.