Site icon HashtagU Telugu

Permission Must: చెట్టు కొట్టేస్తున్నారా.. అనుమతి తప్పనిసరి!

Trees

Trees

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రీ ప్రొటెక్షన్ కమిటీ (టిపిసి) రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో చెట్లను నరికివేసే ముందు ప్రజలు తమ అనుమతి తీసుకోవాలని కోరింది. వ్యక్తులుకానీ, సంస్థలుకానీ ఆయా భూముల్లోని చెట్లను నరికివేస్తే వాల్టా చట్టం, 2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనీ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ చెట్లను నరికివేయాలనకుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరింది. అయితే, అటువంటి అనుమతులు పొందకుండానే చెట్లను నరికివేస్తున్నారని, ఎవరైనా తమ భూమిలో చెట్లను నరికివేయాలనుకున్నా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టీపీసీ స్పష్టం చేసింది.