Ganesh Chaturthi 2023: కర్నాటకలోని హుబ్బళ్లి జిల్లాలో గణేష్ చతుర్థి వేడుకల అంశం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు జరపాలా వద్ద అన్న డైలమాలో ఉండగా హైకోర్టు అనుమతి ఇస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అనుమతిస్తూ ధార్వాడ్-హుబ్బల్లి నగర కార్పొరేషన్ కమిషనర్ ఈశ్వర్ ఉల్లగడ్డి అనుమతి పత్రాన్ని కమిటీకి అందజేశారు. అంతకుముందు ఈద్గా మైదాన్ ఆవరణలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, గణేష్ చతుర్థి వేడుకలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హుబ్బళ్లిలోని ఈద్గా వివాదం 1971 నుంచి జరుగుతుంది. అంజుమన్-ఎ-ఇస్లాం ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించింది. 1921 లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించి భవనాన్ని నిర్మించడంతో వివాదం మొదలైంది. గతంలో 1992లో కాంగ్రెస్ హయాంలో ఈద్గా మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ప్రయత్నం చేసింది. అయితే వివాదాస్పద ల్యాండ్ పై జెండా ఎగురవేయడం సాధ్యం కాదని విరమించింది. ఆ తర్వాత 1994లో బీజేపీ నాయకురాలు ఉమాభారతి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈద్గా మైదానంలో జాతీయ జెండాను ఎగురవేస్తానని సవాలు చేశారు. అయితే మత ఉద్రిక్తతలు జరుగుతాయని భావించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
Also Read: Tirumala Leopards DNA : చిరుతల డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేశాయ్.. బాలికను చంపింది ఏదంటే ?