Site icon HashtagU Telugu

Corona: కొత్తగా రెండు వాక్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు- కేంద్రం

Template (74) Copy

Template (74) Copy

సెంట్రల్ డ్రగ్ అథారిటీ రెండు కోవిడ్ వ్యాచ్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు జారీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తాయారు చేసిన కావోవ్యక్స్(వాక్సిన్), బయోలాజికల్ E వారి కోర్బెవ్యక్స్ (వాక్సిన్), యాంటీ కోవిడ్ పిల్(మాత్ర)కు మంగళవారం అనుమతులు జారీ చేసింది. కాగా 18 సంవత్సరాలలోపు వారు మాత్రమే వీటిని తీసుకోవాలని హెచ్చరించింది. యాంటీ కోవిద్ పిల్ ను దేశవ్యాప్తంగా 13 కంపెనీలు తయారీకి అనుమతులను కూడా జారీ చేసింది. మాత్రను వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచించింది. గర్భిణీ స్త్రీలు మాత్రం వరుసగా అయిదు రోజుల మించి ఈ మాత్రను వాడకూడదని కేంద్రం తెలిపింది.

Exit mobile version