Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యం: మంత్రి రోజా

Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పిన మాటపై నిలబడేది జగనన్న నైజమని.. మాయలు చేయడం చంద్రబాబు నైజమని […]

Published By: HashtagU Telugu Desk
Minister Rk Roja

Minister Rk Roja

Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పిన మాటపై నిలబడేది జగనన్న నైజమని.. మాయలు చేయడం చంద్రబాబు నైజమని ఇది ప్రజలందరికీ తెలుసన్నారు.

జనరంజకమైన పాలన అందిస్తున్న జగనన్న వైపే జనం ఉన్నారన్నారు. ప్రతి ఇంటి వద్ద లభించే ఆప్యాయతాధరణలే జగనన్న పాలన ప్రజలను ఏవిధంగా ఆకట్టుకుందని చెప్పడానికి నిదర్శనమన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలుచేశారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతోందన్నారు. ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. ఎవరు ఏమి అడిగినా అది సాధ్యమా? అసాధ్యమా అని కూడా ఆలోచించడం లేదని చేస్తానని హామీ ఇచ్చేస్తున్నారన్నారు. చంద్రమండలానికి ఉచిత పాస్‌లు కావాలని అడిగినా ఇచ్చేస్తానని ఇచ్చేస్తానంటారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

  Last Updated: 11 Apr 2024, 09:40 PM IST