Credit Card: ప్రాణాలు తీస్తున్న క్రెడిట్ కార్డులు

ఈ మధ్య క్రెడిట్ కార్డు వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ కార్డుకి అర్హులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు. ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే లోతు తెలుస్తుంది.

Credit Card: ఈ మధ్య క్రెడిట్ కార్డు వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ కార్డుకి అర్హులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు. ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే లోతు తెలుస్తుంది. మళ్ళీ బయటకు రావడమే కష్టంగా మారుతుంది. ఇక బ్యాంకర్ల నుంచి వేధింపులు అంత ఇంత కాదు. చేసిన ఖర్చు గుర్తుండదు, కట్టాల్సిన సొమ్మును బ్యాంకర్లు గుర్తు చేస్తూ నరకం చూపిస్తాయి.

క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడేసి ఆర్థికంగా దిగజారిపోతున్నారు. దీంతో మరింత పేదరికం లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్యల్లో ఎంతోమంది ఇరుక్కుని అవస్థలు పడుతున్నారు. కొందరైతే క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేస్తుకుంటున్న పరిస్థితి.

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక ఓ యువ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రెడిట్‌ కార్డు బిల్లులు కట్టలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సురేష్ కుమార్ మరియు అతని భార్య భాగ్య అనే దంపతులు ఆర్థిక ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు దంపతులు తమ పిల్లలను తాతయ్య ఇంటికి పంపారు. పురుగుల మందు కొనుక్కుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసు నమోదు చేశారు.

Also Read: Group 2 Exam : గ్రూప్ 2, ఎస్‌బీఐ ఎగ్జామ్స్ ఈనెల 25నే.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం