Brs Party: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎర్రోళ్ల

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 08:31 PM IST

Brs Party: బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు,రైతుల ఆత్మహత్యలు అని ఫైర్ అయ్యారు. వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసిందని, ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు,నీళ్లు ఇవ్వలేము విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఎర్రోళ్ల అన్నారు.

మహబూబ్ నగర్ లో కేసీఆర్ బస చేస్తే కరెంటు పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి యూనివర్సిటీలో కరెంటు,నీళ్ళు ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారని, చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రోళ్ల మండిపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని, అమలు కాని హామీలు ఇచ్చి ఒక్కటి నేరవేర్చడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు,త్రాగు నీరు లేని
పరిస్థితి వచ్చిందని, ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డు ఎక్కుతున్నారని ఎర్రోళ్ల ఆవేదన వ్యక్తం చేశారు.