Kodali Nani: ప్రజలు భారీగా పోలింగ్ తో జగన్ ను ఆశీర్వదించారు: కొడాలి నాని 

Kodali Nani: కృష్ణాజిల్లా గుడివాడలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ టౌన్ హై స్కూల్ ల్లోని 64వ పోలింగ్ బూత్ లో  ఎమ్మెల్యే కొడాలి నాని ఓటు వేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. తమ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల పోలింగ్ లో మహిళ తల్లులు, వృద్ధులు,  యువత పాల్గొని మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని భావిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ పాలనలో పేదలందరికీ మంచి జరిగిందని, […]

Published By: HashtagU Telugu Desk
Kodalinani Ap

Kodalinani Ap

Kodali Nani: కృష్ణాజిల్లా గుడివాడలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ టౌన్ హై స్కూల్ ల్లోని 64వ పోలింగ్ బూత్ లో  ఎమ్మెల్యే కొడాలి నాని ఓటు వేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. తమ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల పోలింగ్ లో మహిళ తల్లులు, వృద్ధులు,  యువత పాల్గొని మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని భావిస్తున్నానని అన్నారు.

సీఎం జగన్ పాలనలో పేదలందరికీ మంచి జరిగిందని, లబ్ధిదారుల్లో ఎక్కువమంది మహిళలమ్మ తల్లులు ఉన్నారన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు…. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేదలందరూ అనుకుంటున్నారని నాని అన్నారు. సీఎం జగన్ ది పేదవాళ్లను పట్టించుకునే ప్రభుత్వమని, పేదవారికి ఇల్లు కట్టించిన.. మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చిన సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఎండలో సైతం ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు పోలింగ్లో పాల్గొంటున్నారన్నారు.
సీఎం జగన్ ను దీవించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారని కొడాలి నాని అన్నారు.

  Last Updated: 13 May 2024, 09:24 PM IST