UP: ఇదేందయ్యా ఇది.. ఈగల గోల తట్టుకోలేక వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్తులు?

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈగలు దోమలు లాంటి కీటకాలు ఉండటం సహజం. మరి ముఖ్యంగా వర్షాకాలం సమయంలో అలాగే మురికి ప్రాంతాలలో ఈగలు,దోమ

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 03:35 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈగలు దోమలు లాంటి కీటకాలు ఉండటం సహజం. మరి ముఖ్యంగా వర్షాకాలం సమయంలో అలాగే మురికి ప్రాంతాలలో ఈగలు,దోమలు ఎక్కువగా మనకు ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది గుడ్ నైట్,ఆల్ అవుట్ వంటివి ఉపయోగించడంతోపాటుగా దోమలు ఎక్కువగా ఉన్నవారు దోమల బ్యాట్ లేదంటే ఏదైనా హిట్ లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ దోమల బెడద ఎక్కువ అయినప్పుడు ఇంట్లో పొగ కూడా పెడుతూ ఉంటారు.

కానీ ఒక గ్రామంలో మాత్రం ఈగల బెడద తట్టుకోలేక ఏంగా పలువురు స్థానికులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నాయి ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలోని కుయ్య గ్రామంలో గత కొంత కాలంగా ఈగల సమస్య తీవ్రంగా ఉంది. దీనికి వారి గ్రామంలో ఉన్న పౌల్ట్రి ఫామే కారణం. ఈ కారణంగా ఈగల బెడద పెరిగి గ్రామస్థుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈగలు ఎక్కువగా ఉండటంతో నిరంతరం దోమ తెరల కింద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో గ్రామంలో పెళ్లిళ్లు కూడా జరగడం లేదు.

అంతే కాకుండా కొంతమంది మహిళలు గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. బంధువుల రాకపోకలు లేవు. గతంలో అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. ఈ క్రమంతో తమ నిరసనను తెలియజేసేందుకు ఏడుగురు గ్రామస్థులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. గంటల తరబడి చర్చించిన తర్వాత వారు కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే ఈగల సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారట.