Site icon HashtagU Telugu

HYD :’ఊరెళ్లిపోదాం…మామ ..నాల్గు రోజులు హాలిడేస్ వచ్చాయిమామ’

People Going to Villages From Hyderabad

People Going to Villages From Hyderabad

నగరవాసులు (HYD People ) ఇలాగే అనుకుంటూ పాడుకుంటున్నారు. హైదరాబాద్ అంటే బిజీ లైఫ్..కనీసం ఇంట్లో వారితో ప్రశాంతంగా మాట్లాడదామనే టైం కూడా ఉండదు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు చక్రంలా పనిచేస్తూనే ఉండాలి. ఉదయం ఇంట్లో నుండి పోయామా..రాత్రి ఎప్పుడు గాని ఇంటికి రాం. తీరా ఇంటికి వచ్చేసరికి పిల్లలు పడుకోవడం..పెద్దవారు పడుకోవడం చేస్తారు. ఉదయం వారు లేచే టైం కు మళ్లీ మన వర్క్ బిజీ లో మనం అవుతాం. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ ఇలాగే నడుస్తుంది. డబ్బు సంపాదన తప్ప నగరవాసులకు మానసిక ప్రశాంతత మాత్రం లేధు. అందుకే ఆఫీస్ లకు , స్కూల్స్ కు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా..ప్రశాంతంగా ఓ నాల్గు రోజులు సొంత ఉరికి (Villages ) పోదామా అని ఆలోచిస్తుంటారు.

మాములుగా దసరా వచ్చిన , సంక్రాంతి పండగ వచ్చిన హైదరాబాద్ (Hyderabad ) సగం ఖాళీ అవుతుంది. ఓ పది రోజుల పాటు హైదరాబాద్ ను మరచిపోయి..హ్యాపీగా కుటుంబ సభ్యులల్తో పల్లెల్లో గడుపుతుంటారు. ఈ మధ్య ఓ నాల్గు రోజులు వరుసగా సెలవులు వచ్చిన కానీ సొంత ఊరికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో మాదిరి బస్సు లు , రైళ్లు ఎక్కాలని ఏమిలేదు కదా..హైదరాబాద్ లో ఉండేవారికి చాలావరకు సొంత కార్లు ఉన్నాయి.హ్యాపీ గా సొంత కారేసుకొని , కుటుంబ సభ్యులను తీసుకొని సొంతరికి పయనం అవుతున్నారు. ఇక ఇప్పుడు కూడా నగర ప్రజలు అలాగే సొంతరికి పరుగులు పెడుతున్నారు.

వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసిరావడంతో హైదరాబాద్ నగరవాసులు ఊర్లకు పయనమయ్యారు. ఆగస్ట్ 12వ తేదీ రెండో శనివారం కాగా.. ఆగస్ట్ 13వ తేదీ ఆదివారం..ఆగస్ట్ 15న ఎలాగూ ఇండిపెండెన్స్ డే (Independence Day ) హాలిడే ఉంది. దీంతో ఆగస్ట్ 14వ తేదీ(సోమవారం) ఒక్క రోజు సెలవు పెట్టుకొని ఊర్లకు పరుగులు తీస్తున్నారు. రెండు నెలలుగా నగర ప్రజలకు ఈ విధంగా వరుసగా సెలవులు కలిసి రాలేదు. దీనికి తోడు రెండు వారాలు వర్షాల పడడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే వరస సెలవులు రావడంతో కాస్త రిలాక్స్ అవుదామని బిజీ బిజీ హైదరాబాద్ కు బై బై చెప్పి సొంతూర్లకు వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఐటీ ఉద్యోగులు పూర్తి హాలిడే మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ట్రావెల్స్‌లలో టికెట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయట. మొత్తం మీద ఈ నాల్గు రోజులు ప్రశాంత జీవితం గడిపేందుకు పల్లె బాట పట్టారు నగరవాసులు.

Read Also : Rangoli: ఇంటి ముందు, దేవుడి గదిలో వేసే ముగ్గు వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?