Site icon HashtagU Telugu

Maharashtra : కాంగ్రెస్‌ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్‌రావు

BRS Leader Harish Rao

BRS Leader Harish Rao

Harish Rao : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) 51 స్థానాల్లో ఆధిక్యంతో వెనుకంజలో ఉంది. ఎంవీఏలో భాగమైన కాంగ్రెస్‌ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈక్రమంలోనే ఈ ఎన్నికలపై మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్‌ మోసాలు బోల్తా కొట్టాయన్నారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని చురకలు అంటించారు. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది.  తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్ర లో తీవ్ర ప్రభావం చూపెట్టాయని తెలిపారు. ఇక విజయం సాధించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు చెప్పారు.

Read Also: Mechanic Rocky : అమెజాన్ ప్రైమ్ లో ‘మెకానిక్ రాకీ’