Site icon HashtagU Telugu

Roja: జగన్ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటారు: రోజా

Roja

Roja

Roja: గెలుపు వైఎస్సార్‌సీపీదే అని మంత్రి ఆర్కేరోజా ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాదిరి గ్రామంలో పర్యటించారు. ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి చేసేవారికే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ సాక్షాధారాలకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారిగా ఉన్న ప్రభుత్వం మాదన్నారు. చేసిన అభివృద్ది ఇదీ అని చూపి ఓట్లడుగుతున్నామని తమ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా తాము అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎక్కడా వివక్షకు తావివ్వలేదన్నారు.

ఇది ప్రతి ఒక్కరి అంతరాత్మకు తెలుసన్నారు. మంచి పనులు చేశాం కనుక గెలుపు వైఎస్సార్‌సీపీదే అని ధీమాగా చెబుతున్నామన్నారు. చంద్రబాబు ఎన్ని అస్త్రాలు ప్రదర్శించినా అవన్నీ ఎన్నికల బరిలో తేలిపోయాయన్నారు. ప్రజాభిమానం ముందు ఆయన అస్త్రాలనీన తుస్సుమన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు బటన్లు నొక్కి వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యవిజయాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version