Site icon HashtagU Telugu

Peddireddy vs Chandrababu : రుషికొండ మైనింగ్ ఆరోప‌ణ‌ల‌పై చంద్ర‌బాబుపై మండిప‌డ్డ‌ మంత్రి పెద్దిరెడ్డి

Chandrababu Vs Peddireddy

Chandrababu Vs Peddireddy

అక్రమ మైనింగ్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రుషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. చంద్రబాబు అస‌త్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండించారు. కుప్పం మైనింగ్ విషయంలోనూ ఇలాంటి అబద్ధాలే ప్రచారం చేశారని మంత్రి వివరించారు. అధికారులే స్వయంగా పర్యవేక్షించి అక్రమ మైనింగ్ జరగడం లేదని తేల్చారు. కుప్పంలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు.

గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని, టీడీపీ హయాంలోనే మైనింగ్ లో అక్రమాలు జరిగాయని, అనేక సంస్కరణలతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచామన్నారు. ఇసుక టెండర్లను పారదర్శకంగా పిలిచి శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఏపీ మైనింగ్ శాఖ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.