Royal Enfield: రాపిడో బైక్ బుక్ చేస్తే.. ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చింది!

సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు ఎప్పుడు ఏదో ఒక ఘటనలో చర్చనీయాంశమవుతూనే ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Royal Enfield Bullet

Royal Enfield Bullet

సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు ఎప్పుడు ఏదో ఒక ఘటనలో చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఐటీ, రోడ్లు, వరదలు, ఆటో ఛార్జీలు ఏదో ఒక విషయమై నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆసక్తికర మైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిషిత్ పటేల్ అనే వ్యక్తి ఇతర ప్రదేశానికి ప్రయాణం చేయాలనుకున్నాడు. అయితే అతను వెంటనే  రాపిడో లో బైక్ ను బుక్ చేశాడు. తీరా డ్రైవర్, బుక్ ను చేసిన బైక్ ను చూసి ఆశ్చర్యపోతాడు. సాధారణంగా బైక్ బుక్ చేయగానే స్కూటీ లేదా హీరో హోండా, పల్సర్ లాంటివి  పికప్ వస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చి పికప్ చేసుకుంది. దీంతో షాక్ అయిన సదరు కస్టమర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

“ఈ రోజు నేను అనుభవించిన పిచ్చి @peakbengaluru మీతో చెబితే నమ్మరు. నేను కుబెర్నెటీస్ మీట్‌అప్‌కి వెళుతున్నప్పుడు, నా రాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వచ్చాడు.”అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. అతను కూడా మీటప్‌లో చేరాడా?” అని బిగ్గరగా నవ్వుతూ ఆట పట్టించారు.  “మీరు సైడ్ బిజినెస్ నుండి అతని టర్నోవర్ గురించి అడిగారా?” అని మరికొందరు కామెంట్స్ చేయడం ఆకట్టుకుంది.

Also Read: Rajinikanth: రజినీకాంత్ మేనియాకు బాక్సాఫీస్ షేక్, 2 రోజుల్లో 150 కోట్లు రాబట్టిన ’జైలర్‘

  Last Updated: 12 Aug 2023, 12:41 PM IST