Site icon HashtagU Telugu

Revanth Tattoo:రేవంత్ ఫోటోతో ప‌చ్చ‌బొట్టు, ఏపీలో వీరాభిమాని.!

Revanth Tatoo Imresizer

Revanth Tatoo Imresizer

సెల‌బ్రిటీల మీద ఉన్న అభిమానాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ప్ర‌ద‌ర్శిస్తుంటారు. కొంద‌రు ర‌క్త‌తిల‌కం దిద్దుకుంటారు. ఇంకొంద‌రు ప‌చ్చ‌బొట్టు వేయించుకుంటారు. మ‌రికొంద‌రు గుడి క‌డ‌తారు..ఇలా పుర్రెకో బ‌ద్ధి మాదిరిగా భిన్నంగా అభిమానాన్ని చాటుకుంటారు. సినీ సెల‌బ్రిటీల‌కు ఉన్న అభిమానులు ప‌లు సంద‌ర్భాల్లో విచిత్రంగా ప్ర‌ద‌ర్శించిన అభిమానాన్ని చూస్తుంటాం. ఇలాంటి సెల‌బ్రిటీ హోదాను రేవంత్ రెడ్డి రాజ‌కీయాల్లో సంపాదించారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద అభిమానాన్ని చాటుకోవ‌డానికి ఓ అభిమాని ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. వీపుకు ఎడ‌మ‌వైపు రేవంత్ రెడ్డి ఫోటోను ప‌చ్చ‌బొట్టుగా ముద్రించుకున్నాడు. ఆ అభిమాని తెలంగాణ‌కు చెందిన కార్య‌క‌ర్త కాదు. విచిత్రంగా ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆయ‌న‌ది. ఆయ‌న పేరు కొర్రపాటి నరేంద్ర నాథ్ . అత‌ను రేవంత్ రెడ్డి వీరాభిమాని. గాంధీ భవన్ లో గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి న‌రేంద్ర‌నాథ్ శాలువా కప్పి సన్మానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.