Site icon HashtagU Telugu

CSK vs PBKS: చెపాక్ లో చెన్నైకు చెక్… ఉత్కంఠ పోరులో పంజాబ్ స్టన్నింగ్ విన్

CSK vs PBKS

91082402

CSK vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సూపర్ ఫామ్ లో ఉన్న డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. తొలి వికెట్ కి వీరిద్దరూ 9.4 ఓవర్లలో 84 పరుగులు జోడించారు. రుతురాజ్ 37 రన్స్ కు ఔట్ అయినా..కాన్వే దూకుడు కొనసాగింది. శివమ్ దూబే 28 , మొయీన్ అలీ జ‌డేజా త‌క్కువ స్కోర్ల‌కే ఔటైనా కాన్వే మాత్రం త‌న జోరును కొన‌సాగించాడు. చివ‌రి రెండు బంతుల‌ను ధోనీ సిక్స‌ర్లుగా మలచడంతో చెన్నై 4 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. ధోనీ కేవ‌లం నాలుగు బాల్స్‌లోనే రెండు సిక్స‌ర్ల‌తో 13 ప‌రుగులు చేశాడు. కాన్వే 52 బాల్స్‌లో 16 ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 92 ప‌రుగులు చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, సామ్ క‌ర‌న్‌, సికింద‌ర్ ర‌జా, రాహుల్ చాహ‌ర్ త‌లో ఒక్క వికెట్ తీసుకున్నారు.

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కూడా ధాటిగా ఆడింది. ఓపెనర్లు ధావన్ , ప్రబ్ సిమ్రన్ సింగ్ తొలి వికెట్ కు 51 పరుగులు జోడించారు. ధావన్ ఔట్ అయ్యాక ప్రబ్ సిమ్రన్ సింగ్ తన జోరు కొనసాగించాడు. అయితే అధర్వ , ప్రబ్ సిమ్రన్ సింగ్ వెంట వెంటనే ఔట్ అవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ప్రబ్ సిమ్రన్ సింగ్ 42 రన్స్ చేయగా…తర్వాత లివింగ్ స్టోన్, సామ్ కరన్ చెలరేగి ఆడారు. ముఖ్యంగా లివింగ్ స్టోన్ 15వ ఓవర్లో రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు , రెండు ఫోర్లతో పంజాబ్ ను మళ్లీ రేసులో నిలిపాడు. ఇదే ఓవర్లో లివింగ్ స్టోన్ ఔట్ అయినా…జితేష్ శర్మ , సికిందర్ రాజా ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. చివరి ఓవర్లో విజయం కోసం 9 పరుగులు చేయాల్సి ఉండగా… పతిరణ అద్భుతంగా బౌలింగ్ చేసి జితేశ్ శర్మను ఔట్ చేశాడు. అయితే చివరి బంతికి 3 రన్స్ చేయాల్సి ఉండగా…సికిందర్ రాజా పంజాబ్ కు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది అయిదో విజయం.

Read More: Chaitanya Master : బ్రేకింగ్.. ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్..